కాకినాడ జిల్లాలో చిన్నారి జాహ్నవి గల్లంతైన ఘటనపై గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎనిమిది రోజులుగా చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఘటన జరిగిన ప్రాంతంలో NDRF, రాపిడ్ రెస్పాన్స్, హనుమాన్ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. కొండ ప్రాంతం అంతటా విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇప్పటికే చిన్నారి పెంపుడు కుక్కకు నిర్వహించిన పోస్టుమార్టం పూర్తయిందని వైద్యులు తెలిపారు. త్వరలో కుక్క పోస్టుమార్టం నివేదిక వెలువడనుంది. ఈ నివేదిక ద్వారా ఘటనపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రాథమిక అనుమానాల ప్రకారం చిన్నారి కొండచిలువ బారిన పడి ఉండవచ్చని సీఐ అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ఆ ప్రాంతంలో మనుషులపై జంతువుల దాడి ఘటనలు గతంలో నమోదు కాలేదని అటవీశాఖ అధికారి పట్టాభి పేర్కొన్నారు. దీంతో ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కేసుపై స్పందించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో మరిన్ని బృందాలను రంగంలోకి దించి గాలింపు విస్తరించారు. అధికారులు ప్రతి సాధ్యమైన కోణంలో పరిశీలిస్తూ చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news