హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం ఆ ప్రాంతం గుండా ప్రయాణించే నౌకలు నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉండవచ్చని ఇరాన్ మీడియా పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై నిషేధం విధించినట్లు సమాచారం అందుతోంది. అలాగే ఇరాన్‌పై ఆంక్షలు విధించే ఇతర దేశాల నౌకలకు కూడా ఈ నిబంధనలు వర్తించనున్నట్లు వెల్లడైంది.
ఈ బిల్లులో భాగంగా ఎంత మొత్తంలో ఛార్జీలు వసూలు చేయబడతాయనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అలాగే భారత్ ఈ జాబితాలో ఉందా లేదా అన్న విషయంపై కూడా అధికారిక వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే భారత నౌకలపై ప్రస్తుతం ఇరాన్ ఎలాంటి ఛార్జీలు విధించట్లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. ఈ పరిణామం అంతర్జాతీయ షిప్పింగ్, వాణిజ్య మార్గాలపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news