భారత్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది. ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నగరంలో కొనసాగుతున్న హింసాత్మక అల్లర్లు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. జూన్ 27, జూన్ 29 తేదీల్లో భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు బెల్ఫాస్ట్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత జట్టులో చోటు దక్కించుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశమున్న ఈ సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో బెల్ఫాస్ట్లో జరిగిన హింసాత్మక ఘటనలు పరిస్థితిని క్లిష్టంగా మార్చాయి. స్థానిక ప్రజలు, వలసదారుల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు అల్లర్లకు దారితీయగా, పలు ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అధికారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేసింది. అవసరమైతే మ్యాచ్‌లను మరో నగరానికి తరలించే అవకాశాన్ని పరిశీలించాలని ఐర్లాండ్ క్రికెట్ బోర్డుకు సూచించినట్లు సమాచారం. మరోవైపు స్థానిక ప్రభుత్వం, ఐర్లాండ్ క్రికెట్ బోర్డు కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. రాబోయే రోజుల్లో శాంతిభద్రతలు పునరుద్ధరించబడితే సిరీస్ యథావిధిగా జరిగే అవకాశం ఉంది. లేదంటే వేదిక మార్పు లేదా సిరీస్ వాయిదా వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం భారత్-ఐర్లాండ్ సిరీస్ నిర్వహణపై తుది నిర్ణయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news