హైదరాబాద్‌లో మైక్రోఫైనాన్స్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు ఈ కేసులో అనుమానితుల బ్యాంక్ లావాదేవీలపై లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు శివచౌహాన్ అకౌంట్‌కు నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, మూడుసార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన వెంటనే అదే రోజున నగదు విత్‌డ్రా చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఈ అనుమానాస్పద లావాదేవీల నేపథ్యంలో రమావత్ మధు అకౌంట్‌ను అధికారులు సీజ్ చేశారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర అకౌంట్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు.
రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి, శివచౌహాన్కు చెందిన బ్యాంక్ ఖాతాల పూర్తి వివరాలు ఇవ్వాలని సంబంధిత బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. ఈ నిధుల ప్రవాహం వెనుక ఉన్న అసలు కారణాలు, మిగతా వ్యక్తుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.
మైక్రోఫైనాన్స్ పేరుతో జరిగిన ఆర్థిక లావాదేవీలలో అక్రమాలు జరిగాయా? లేదా ఏదైనా పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఈ కేసు మరింత కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news