హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి కారులో అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న 16.230 కిలోల గంజాయిని అధికారులు చాపల్ రోడ్డులో శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన గులాం రసూల్‌తో పాటు నాంపల్లికి చెందిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు ఒక కారు, ఆరు మొబైల్ ఫోన్లు, రూ.14,500 నగదును అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సీఐ మహేష్ వెల్లడించారు. అనంతరం కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
రాష్ట్రంలో మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎక్సైజ్ శాఖ, ఇతర రాష్ట్రాల నుంచి జరుగుతున్న సరఫరాపై నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. గంజాయి సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news