హైకోర్టుకు ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. సెలవుల అనంతరం జూన్ 15 నుంచి హైకోర్టు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానుంది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
వేసవి సెలవుల సమయంలో అత్యవసర కేసుల విచారణ కోసం ప్రత్యేక వెకేషన్ బెంచ్‌లను ఏర్పాటు చేశారు. రెండు దశల్లో ఈ విచారణలు కొనసాగనున్నాయి.
మొదటి దశలో మే 14, 21, 28 తేదీల్లో విచారణలు నిర్వహించనున్నారు. ఈ దశలో హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు, జస్టిస్ మెడమల్లి బాలాజీ డివిజన్ బెంచ్గా వ్యవహరించనుండగా, జస్టిస్ తుహిన్ కుమార్ సింగిల్ బెంచ్గా కేసులను విచారించనున్నారు.
రెండో దశలో జూన్ 4, 11 తేదీల్లో విచారణలు జరుగనున్నాయి. జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ శర్మ డివిజన్ బెంచ్గా, జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి సింగిల్ బెంచ్గా విధులు నిర్వహించనున్నారు.
అదేవిధంగా డివిజన్ బెంచ్ విచారణలు పూర్తయ్యాక సంబంధిత న్యాయమూర్తులు సింగిల్ బెంచ్ కేసులను కూడా విచారించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మొత్తంగా వేసవి సెలవుల సమయంలో కూడా అత్యవసర కేసుల విచారణకు అంతరాయం కలగకుండా హైకోర్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Fetching videos...
Fetching latest news...
No trending news