ఆంధ్రప్రదేశ్లో పగటిపూట మండుటెండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయగా, రాత్రికి పలుచోట్ల భారీ వర్షం కురిసి ఉపశమనం కలిగించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అటు కాకినాడ జిల్లా పిఠాపురంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నంద్యాల జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పటికే కోతకు వచ్చిన పంటలు వానకు తడిసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news