గూడూరు పట్టణంలోని డీఆర్డబ్ల్యూ కాలేజీలో AP స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్, శ్రీ పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మెన్ తానంకి నానాజీతో కలిసి పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన నిరుద్యోగ యువతకు ఆఫర్ లెటర్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోందని ఆయన చెప్పారు.
గూడూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 7 మినీ జాబ్ మేళాలు, 3 మెగా జాబ్ మేళాలు నిర్వహించగా, మొత్తం 1768 మంది పాల్గొనగా 1057 మంది ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. తాజా జాబ్ మేళాలో 15 కంపెనీలు పాల్గొని 900 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాయని ఆయన వివరించారు.
విశాఖలో గూగుల్ డేటా ఏఐ సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు పెద్ద మలుపు అని ఆయన అన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడంలో ముందంజలో ఉందని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ స్పష్టం చేశారు.

Fetching videos...
Fetching latest news...
No trending news