బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గత రెండు వారాలుగా తగ్గుదల దిశగా సాగిన బంగారం ధరలు శుక్రవారం ఒక్కసారిగా ఎగబాకాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న అనిశ్చితి, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం వల్ల పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ ధరలపై కూడా కనిపిస్తోంది.
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,580కు చేరగా, ఒక్కరోజులోనే రూ.2,940 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,200కు చేరి రూ.2,700 పెరుగుదల నమోదు చేసింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే స్థాయి ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,50,550కు చేరి రూ.3,270 పెరగగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,000 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,48,580, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,200 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,820గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,350 వద్ద నమోదైంది. దేశీయ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు దాదాపు రూ.3 వేల వరకు పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.60 లక్షలకు చేరి ఒక్కరోజులోనే రూ.10 వేల పెరుగుదల నమోదు చేసింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక పరిణామాల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news