బంగారం, వెండి ధరలు గత కొన్ని వారాలుగా తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఆర్థిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో పసిడి, వెండి ధరలు స్థిరత్వం కోల్పోయాయి. ఒకరోజు భారీగా పెరుగుతుంటే, మరుసటి రోజు గణనీయంగా తగ్గుతున్నాయి. అయితే ఈ వారం మొత్తం మీద చూస్తే బంగారం, వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా బంగారం ధరలు దాదాపు రూ.5 వేల వరకు తగ్గడం, వెండి ధరలు రూ.1,500 మేర పతనం కావడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఈ వారం బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర వారాంతానికి మొత్తం రూ.5,000 వరకు తగ్గగా, కిలో వెండి ధర రూ.1,500 మేర పడిపోయింది. వారం ప్రారంభంలో వరుసగా తగ్గిన ధరలు చివరి రెండు రోజుల్లో స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, అమెరికా-ఇరాన్ సంబంధాల ప్రభావంతో విలువైన లోహాల ధరలు మారుతున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news