ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగిన రూ.4 కోట్ల విలువైన నగల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షోరూమ్‌లో ఉద్యోగిగా చేరిన నితిన్ వర్మ అనే యువకుడు తన ప్రేయసి కాజల్ వర్మతో పెళ్లి ఖర్చుల కోసం ఈ భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నితిన్‌తో పాటు అతని ప్రేయసి, తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, నితిన్ ముందస్తు ప్రణాళికతోనే నెలన్నర క్రితం నగల షోరూమ్‌లో ఉద్యోగంలో చేరాడు. ఈ సమయంలో షోరూమ్‌లోని భద్రతా వ్యవస్థ, విలువైన ఆభరణాల నిల్వ ప్రాంతాలు, తాళాల నిర్వహణ వంటి కీలక సమాచారాన్ని సేకరించాడు. అనంతరం ఎవరూ అనుమానించకుండా ఉండేందుకు తన వివాహం నిశ్చయమైందని సహోద్యోగులను నమ్మించి జూన్ 12న ప్రత్యేకంగా మందు పార్టీ ఏర్పాటు చేశాడు.
ఆ పార్టీకి ప్రేయసి కాజల్ వర్మతో పాటు నితిన్ తండ్రి కూడా హాజరయ్యారు. షోరూమ్ తాళాల బాధ్యతలు చూసే క్యాషియర్ గౌతమ్ రాజ్‌ను ఎక్కువ మద్యం తాగేలా చేసి, అతడిని ఇంటి వద్ద దింపే సమయంలో తాళాలు కాజేసినట్లు పోలీసులు తెలిపారు.
మరుసటి రోజు ఉదయం నితిన్ తన స్నేహితుడితో కలిసి దొంగిలించిన తాళం చెవిని ఉపయోగించి షోరూమ్‌లోకి ప్రవేశించాడు. కేవలం 25 నిమిషాల్లోనే మొదటి అంతస్తులో ఉన్న బంగారం, వజ్రాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలను సేకరించి అక్కడి నుంచి పరారయ్యాడు. దోచుకున్న నగల మొత్తం విలువ సుమారు రూ.4 కోట్లుగా పోలీసులు అంచనా వేశారు.
షోరూమ్‌లో అలారం వ్యవస్థ లేకపోవడం, రాత్రి భద్రతా సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత ఈ ఘటన జరగడం నిందితులకు కలిసి వచ్చిందని అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల తర్వాత భద్రతా సిబ్బంది అక్కడ లేకపోవడంతో దొంగతనం ఎవరూ గుర్తించలేకపోయారు.
విచారణలో పెళ్లి ఖర్చులను సమకూర్చుకోవడానికే ఈ దోపిడీకి పాల్పడినట్లు నితిన్ అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దొంగిలించిన ఆభరణాల రికవరీ, ఇతర సహచరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు గాజియాబాద్‌లో తీవ్ర సంచలనంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news