పవిత్ర వివాహ బంధంతో ఒక్కటైన నూతన దంపతులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెం గ్రామానికి చెందిన పేరం నాగరాజు, మేరీ కుమారి దంపతుల కుమారుడు మణికంఠ వివాహం, పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన కాటుపోయిన శ్రీనివాసరావు, వెంకటరమణ దంపతుల కుమార్తె యామినితో శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆదివారం ఉదయం రామారావుగూడెంలోని వరుడి స్వగృహంలో వివాహ రిసెప్షన్ వేడుక వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తరఫున ఆయన కార్యాలయ ప్రతినిధులు హాజరయ్యారు.
నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రతినిధులు, “మహేష్ అన్న పెళ్లికానుక” పేరుతో ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news