ప్రధాని నరేంద్ర మోదీ తమ నివాసానికి రావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగ ట్వీట్ చేశారు.
“ఈ సాయంత్రాన్ని మా కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది” అంటూ ప్రధాని మోదీ పర్యటనను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. బిజీ షెడ్యూల్ మధ్య కూడా తమ నివాసానికి వచ్చి ఆత్మీయంగా గడపడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీతో జరిగిన భేటీ ఎంతో ఆత్మీయంగా సాగిందని, కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన ఆ క్షణాలు ప్రత్యేకమైనవని చంద్రబాబు ట్వీట్లో తెలిపారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ-టీడీపీ సంబంధాల బలోపేతానికి ఈ భేటీ మరో సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news