13">చైనా తయారీ సీసీటీవీ కెమెరాలు మరియు సంబంధిత పరికరాలపై దేశంలో నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హికవిజన్, దహువా, టీపీ-లింక్ వంటి సంస్థల ఉత్పత్తులను ఏప్రిల్ 1 నుంచి నియంత్రించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో అమ్మకానికి ఉంచే సీసీటీవీ ఉత్పత్తులు తప్పనిసరిగా కేంద్రం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి.
భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా చైనా సంస్థలు తయారు చేసిన చిప్సెట్లను ఉపయోగించే పరికరాలకు అనుమతి ఇవ్వడంలో అధికారులు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ చర్యలు డేటా భద్రత, జాతీయ భద్రత పరిరక్షణకు సంబంధించినవిగా పరిగణించబడుతున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news