రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. మొత్తం రూ.30,156 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీటి సదుపాయాలను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఇంటి వద్దే తాగునీరు అందేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటికే ఉన్న తాగునీటి వనరులను మెరుగుపరచడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త నీటి సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అమరజీవి జలధార కార్యక్రమంతోనూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టనున్నారు.
రేపు ఉదయం 11.20 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం ఇద్దరు నేతలు బహిరంగ సభలో పాల్గొని కార్యక్రమం లక్ష్యాలు, తాగునీటి సరఫరా ప్రణాళికపై వివరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది. రూ.30,156 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది కుటుంబాలకు కొత్తగా కుళాయి కనెక్షన్లు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమం ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news