ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. ఆయన నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బందితో పాటు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి, ఆయన నివాస పరిసరాల్లో నిఘాను పెంచారు.
విపక్షాల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. జ్ఞానేష్ కుమార్ భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భద్రతా ఏర్పాట్లను పెంచినట్లు సమాచారం. ఆయన నివాసం వద్దకు వచ్చే వ్యక్తులు, వాహనాలపై కూడా భద్రతా సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
ఎన్నికల సంఘం వ్యవహారాలపై విపక్ష పార్టీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఈసీకి భద్రత పెంచడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో జ్ఞానేష్ కుమార్ నివాసం వద్ద పటిష్ఠ బందోబస్తు కొనసాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news