నేడు తెలుగు ప్రజల ఆత్మబంధువు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దార్శనికుడిగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. “సేవే జీవితం.. అభివృద్ధే లక్ష్యం” అనే నినాదంతో ప్రజాసేవకు అంకితమైన ఆయన రాజకీయ ప్రస్థానం అర్ధ శతాబ్దానికి పైగా కొనసాగుతోంది.
ప్రజల కోసం అలుపెరగని కృషి, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతర తపన, భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టి చంద్రబాబు నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి. సమాచార సాంకేతిక రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన హైటెక్ సిటీ నిర్మాణం ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఐటీ విప్లవానికి పునాది వేసి వేలాది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన నాయకుడిగా ఆయన పేరు నిలిచిపోయింది.
అమరావతి నిర్మాణానికి పునాదులు వేసి ఆధునిక రాజధాని కలను ఆవిష్కరించడం, పోలవరం ప్రాజెక్టుకు కొత్త ఊపు తీసుకురావడం కూడా ఆయన దార్శనికతకు నిదర్శనాలుగా భావిస్తున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రస్తుతం “స్వర్ణాంధ్ర విజన్-2047”తో భావితరాల భవిష్యత్తుకు బాటలు వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. విద్య, ఉపాధి, పరిశ్రమలు, సాగునీటి రంగం, సాంకేతిక పురోగతి వంటి అంశాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.
“నేను పాలకుడిని కాదు, సేవకుడిని” అనే ఆయన మాటలు ప్రజానాయకత్వానికి ప్రతీకగా నిలిచాయి. ప్రజల మధ్యే ఉండి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించడం ఆయన ప్రత్యేక శైలి.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ “జయహో చంద్రన్న” అంటూ రాష్ట్రం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.
Fetching videos...
Fetching latest news...
No trending news