విశాఖపట్నం : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్‌లోని ఎల్ఐసీ భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరుశురాము రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మరియు ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజ సమానత్వం, న్యాయం, హక్కుల పరిరక్షణకు అంబేద్కర్ గారి ఆలోచనలు ఇప్పటికీ ప్రేరణగా నిలుస్తున్నాయని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితోనే పాలన కొనసాగిస్తోందని పీవీఎన్ మాధవ్ అన్నారు.
అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ములకలపల్లి ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుభుక్త శ్రీనివాసరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరెడ్డి రాకేష్ చంద్ర, రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యుడు బొచ్చా సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news