విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ‘భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ డిజిటల్ ప్రయాణంలో ఈ కార్యక్రమం ఒక నూతన అధ్యాయానికి ప్రారంభమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విశాఖపట్నం భవిష్యత్ అభివృద్ధి కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
2047 నాటికి విశాఖను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. పదేళ్లలోనే విశాఖ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందే గ్లోబల్ టెక్ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామని తెలిపారు.
ఈ కాంక్లేవ్ ద్వారా విశాఖను అంతర్జాతీయ స్థాయి ఏఐ మరియు డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
Fetching videos...
Fetching latest news...
No trending news