బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమం మరియు ‘జలధార జలహారతి’ గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొని నీటి సంరక్షణపై ప్రజలకు, అధికారులకు ముఖ్య సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును సంరక్షించడం అత్యవసరమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడటం మనందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో నీటి వినియోగం, సంరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించి, పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అమృతలూరి స్పందన, మండల టీడీపీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, తెలుగు యువత నాయకులు, రైతు సంఘ నాయకులు, ఎస్సీ సెల్ ప్రతినిధులు మరియు స్థానిక పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news