అరబ్ దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒపెక్ (OPEC) సంస్థకు పెద్ద షాక్ ఇస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆ సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అలాగే ఒపెక్ ప్లస్ కూటమి నుంచి కూడా UAE తప్పుకున్నట్లు సమాచారం వెలువడింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
UAE తీసుకున్న ఈ నిర్ణయంతో ముడి చమురు సరఫరా వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశముండటంతో, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామం గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయంపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news