వ్యక్తిగత అభివృద్ధి, విజయానికి సంబంధించిన చర్చలు ఎప్పుడూ ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తుంటాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత, డిజిటల్ కంటెంట్ సృష్టికర్త అంకుర్ వారికూ పంచుకున్న ఒక చాట్‌జీపీటీ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ప్రపంచంలోని యాభై శాతం మంది కంటే ఎక్కువ విజయవంతమైన వ్యక్తిగా ఎలా మారవచ్చని ఆయన చాట్‌జీపీటీని ప్రశ్నించగా, అసాధారణ రహస్యాల కంటే ప్రతిరోజూ పాటించాల్సిన తొమ్మిది సాధారణ అలవాట్లనే అది సూచించింది. ఈ సంభాషణను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అనేక మంది ప్రశంసించారు ఈ సూచనలలో ప్రధాన సందేశం ఏమిటంటే, విజయం ఒక్కసారిగా వచ్చే అదృష్టం, అసాధారణ ప్రతిభ లేదా అరుదైన అవకాశాల ఫలితం మాత్రమే కాదు. ప్రతిరోజూ క్రమశిక్షణతో అనుసరించే చిన్న చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో పెద్ద మార్పును తీసుకువస్తాయని చాట్‌జీపీటీ పేర్కొంది. అంకుర్ వారికూ కూడా ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, గొప్ప విజయాల వెనుక ఆకర్షణీయమైన రహస్యాల కంటే స్థిరమైన దినచర్యలే ఉంటాయని వ్యాఖ్యానించారు
చాట్‌జీపీటీ సూచించిన మొదటి అలవాటు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం. శరీర గడియారం క్రమబద్ధంగా పనిచేయాలంటే స్థిరమైన నిద్ర, మేల్కొనే సమయం అవసరమని సూచించింది. ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రోజంతా ఉత్సాహంగా పనిచేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని వివరించింది.
రెండో సూచన శారీరకంగా చురుకుగా ఉండడం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం లేదా శరీరానికి తగినంత కదలిక కల్పించడం ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా ఏకాగ్రత, ఉత్పాదకతను కూడా పెంచుతుందని పేర్కొంది. ఆరోగ్యకరమైన శరీరం విజయానికి పునాదిగా నిలుస్తుందని ఈ సూచనలో పేర్కొంది
Fetching videos...
Fetching latest news...
No trending news