విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో సెంట్రల్ నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు తాడిశెట్టి శ్రీనాగలక్ష్మి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల ప్రవాహంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని ఆమె పేర్కొన్నారు.
ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని అన్నారు. దేశంలోకి వచ్చే ప్రతి రూ.100 పెట్టుబడిలో సుమారు రూ.26 పెట్టుబడులు ఏపీకే వస్తున్నాయని తెలిపారు. ఇది సీఎం చంద్రబాబు విజన్, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషికి నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పెద్దఎత్తున విదేశీ మరియు దేశీయ పెట్టుబడులు వస్తున్నాయని ఆమె తెలిపారు. గూగుల్ డేటా సెంటర్, మిత్తల్ స్టీల్ ప్లాంట్, క్యారియర్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కార్ని జెడ్, అడ్వాన్స్డ్ కాంబటి ఎయిర్ కాస్ట్ యూనిట్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు.
అలాగే కాకినాడలో హీరో ఫ్యూచర్ ఎనర్జీ ప్రాజెక్ట్, అనకాపల్లిలో రూ.5400 కోట్ల రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టులు, శ్రీ సిటీలో రూ.5000 కోట్ల ఎల్జీ సెమీకండక్టర్ ప్రాజెక్టులు వంటి అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అవుతున్నాయని ఆమె వివరించారు.
ఈ పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచుతుందని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం ప్రస్తుతం పారిశ్రామిక అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని ఆమె తెలిపారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఇది అని పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కేంద్రంగా మారుతోందని, అభివృద్ధి వేగం మరింత పెరుగుతోందని తాడిశెట్టి శ్రీనాగలక్ష్మి ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news