అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనపెట్టి పాలన సాగించిందని విమర్శించారు. అందుకే ప్రజలు వారిని కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన 39వ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఓపికగా విని, కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
గత 22 నెలల కాలంలో అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు తన దృష్టికి మొత్తం 957 అర్జీలు వచ్చాయని, వాటిని ప్రాధాన్యతల వారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు.
కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి వల్లే ఇలాంటి ప్రజాదర్బార్ కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. వార్డు స్థాయి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి ఉండేదని ఆయన విమర్శించారు. ఆ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news