కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో మారుతున్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సరిహద్దుల ద్వారా నిత్యం చొరబాట్లు జరిగేవని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అక్రమ వలసదారులు తమంతట తామే వెనక్కి వెళ్లడం ప్రారంభించారని తెలిపారు.
స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లే వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని అమిత్ షా స్పష్టం చేశారు. అయితే స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడదని ఆయన అన్నారు.
మమతా పాలనలో సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లు పెరిగాయని అమిత్ షా ఆరోపించారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు.
సరిహద్దు భద్రతా దళాలకు కేవలం ఏడు రోజుల్లోనే ఆరు వందల హెక్టార్ల భూమిని అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో సరిహద్దు ఫెన్సింగ్ పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు.
దేశ భద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అమిత్ షా తెలిపారు. అక్రమ చొరబాట్లను పూర్తిగా అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news