గోకవరం : ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రంప ఎర్రంపాలెం గ్రామానికి చెందిన జుత్తుగ నాని గారు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల ఫౌండేషన్ అధ్యక్షులు బత్తిన రామకృష్ణ గారి సూచన మేరకు ఈ సేవా కార్యక్రమం నిర్వహించబడింది. సుమారు 50 మంది పేషెంట్లకు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది సమక్షంలో పండ్లు అందజేశారు.
ఈ కార్యక్రమం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ రామలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరిగింది. రాయవరపు శ్రీను, అల్లాడి అరుణ, ప్రముఖ ఫార్మసిస్ట్ కరాసు శివరామకృష్ణ, ఎల్ఐసి సీనియర్ ఏజెంట్ గారబోయిన శ్రీనివాస్, డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు వైవి తదితరులు పాల్గొన్నారు.
దాత జుత్తుగ నాని గారు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో పేదలకు సహాయం చేయడం ద్వారా అంబేద్కర్ గారి ఆశయాలకు నిజమైన నివాళి అర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ రామలక్ష్మి గారు దాతను అభినందిస్తూ ప్రతి ఒక్కరిలో సేవా భావం పెరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు, ఆసుపత్రి వైద్యులు, నర్సులు మరియు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news