తారక రామ కాలనీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక తారక రామ కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీఐ కె. నారాయణ రావు, ఎక్సైజ్ సీఐ చిన్నం నాయుడు, కారుణ్య సంస్థ అధినేత మరియు రోటరీ జిల్లా అధ్యక్షులు జె.సి రాజు ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ దుప్పట్లు ఎక్సైజ్ సీఐ చిన్నం నాయుడు సమకూర్చగా, సీఐ నారాయణ రావు మరియు జె.సి రాజు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి “చదువు–సమీకరించు–పోరాడు” అనే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు.
పేదరికం విద్యకు అడ్డంకి కాదని అంబేద్కర్ గారు నిరూపించారని, ఆయన జీవితం ప్రతి వర్గానికి ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల పరిరక్షణ కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘ సభ్యులు, స్థానిక యువత మరియు పలువురు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news