పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విస్తృతంగా పర్యటించి సుమారు రూ.2 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. గోనమాకులపల్లె, కృష్ణాపురం పంచాయతీల పరిధిలో సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలను ప్రారంభించిన ఆయన గ్రామస్తుల నుంచి ఘన స్వాగతం అందుకున్నారు. కృష్ణాపురం టోల్ గేట్ వద్ద జనసైనికులు గజమాలతో సత్కరించి స్వాగతం తెలిపారు.
పర్యటనలో భాగంగా గోనమాకులపల్లె ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాలను ప్రారంభించారు. గోనమాకులపల్లె నుంచి ఎస్.బండపల్లి వరకు, మరిమాకులపల్లి, తెట్టు గ్రామం, నాగిరెడ్డి పల్లి, చిన్న శ్యామ, వెంకటపల్లి, మోట్లపల్లి, కృష్ణాపురం, మద్ధిరాలు, ఎడగురికి, దానమయ్య గారి పల్లె వంటి ప్రాంతాల్లో వివిధ సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామాల్లో రవాణా సౌకర్యం మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
అభివృద్ధి పనులతో పాటు ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. గోనమాకులపల్లె పాఠశాలలో ఆర్వో ప్లాంట్, గేటు ఏర్పాటు చేయాలని విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. బండపల్లి గ్రామంలో మహిళలు కమ్యూనిటీ హాల్ అవసరాన్ని ప్రస్తావించగా, తెట్టు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్, డ్రైనేజీ మరమ్మతులు కోరారు. ఈ సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఇంటికి శుద్ధ జలం అందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని గ్రామస్తులకు వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, ఇంకా ఉన్న సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్, టీడీపీ, జనసేన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news