ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) చీఫ్ కళ్యాణ్ చౌబేపై మహిళా అధికారి వాలంకా అలెమావో వేధింపుల ఆరోపణలు చేశారు. మార్చి 29న జరిగిన ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చౌబేతో పాటు ఇతర అధికారులు తనను హేళన చేసి, అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనపై అనవసరమైన, అగౌరవకర వ్యాఖ్యలు చేయడంతో పాటు భయపెట్టే విధంగా మాట్లాడారని వాలంకా ఆరోపించారు. ఏఐఎఫ్ఎఫ్ మహిళా కమిటీ చీఫ్గా ఉన్న ఆమె ఇటీవల ఫెడరేషన్ పనితీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాలు ఇంకా స్పందించాల్సి ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news