అమెరికా రక్షణ శాఖ నాయకత్వం కూడా దేశ **"ఆర్సెనల్ ఆఫ్ ఫ్రీడమ్"**ను మరింత బలపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే ఈ ప్రకటనల వెనుక మరో వాస్తవం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై దాదాపు 40 రోజులపాటు సాగిన తీవ్ర సైనిక చర్యల్లో అమెరికా భారీ మొత్తంలో అత్యాధునిక క్షిపణులు, వైమానిక దాడి ఆయుధాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను వినియోగించింది.
అమెరికా ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ యుద్ధానికి ఇప్పటివరకు సుమారు 37.5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఇందులో అత్యధిక వ్యయం ఆయుధాలు, క్షిపణులు, మందుగుండు సామగ్రి వినియోగంపైనే జరిగినట్లు సమాచారం. యుద్ధ విరమణ అమల్లోకి వచ్చే వరకు అమెరికా దళాలు ఇరాన్లో 13 వేలకుపైగా లక్ష్యాలపై దాడులు నిర్వహించాయి. అదే సమయంలో ఇరాన్ అమెరికా ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ యుద్ధానికి ఇప్పటివరకు సుమారు 37.5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఇందులో అత్యధిక వ్యయం ఆయుధాలు, క్షిపణులు, మందుగుండు సామగ్రి వినియోగంపైనే జరిగినట్లు సమాచారం. యుద్ధ విరమణ అమల్లోకి వచ్చే వరకు అమెరికా దళాలు ఇరాన్లో 13 వేలకుపైగా లక్ష్యాలపై దాడులు నిర్వహించాయి. అదే సమయంలో ఇరాన్ ప్రయోగించిన 1,700కుపైగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.
ఈ స్థాయి సైనిక చర్యల కారణంగా అమెరికా అత్యాధునిక ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అత్యాధునిక క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థల్లో ఉపయోగించే ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, దీర్ఘశ్రేణి దాడి ఆయుధాల ఉత్పత్తికి ఎక్కువ సమయం, అధిక వ్యయం అవసరం. అందువల్ల వినియోగించినంత వేగంగా వాటిని తిరిగి తయారు చేయడం సాధ్యం కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేసి దౌత్య చర్చలకు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక వ్యూహాత్మక కారణాలు కూడా ఉండవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, యుద్ధాన్ని మరింత విస్తరించడం వల్ల అమెరికా ఆయుధ నిల్వలు ఇంకా వేగంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాదారులు సూచించినట్లు సమాచారం. దీంతో సైనిక చర్యలను విస్తరించకుండా చర్చలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news