HomeInternationalRSS కార్యక్రమంలో IPS అధికారి ప్రసంగం.. రాజ్ ఠాక్రే..
RSS కార్యక్రమంలో IPS అధికారి ప్రసంగం.. రాజ్ ఠాక్రే ఫైర్
Updated 1 hours ago
మహారాష్ట్రలో రాజకీయ వివాదం చెలరేగింది. సీనియర్ ఐపీఎస్ అధికారి విశ్వాస్ నంగరే పాటిల్ హిందూ సకల్ సమాజ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని RSSపై ప్రశంసలు కురిపించిన వీడియో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. పోలీసు అధికారిగా ఆయన విధి, బాధ్యతలకు మాత్రమే కట్టుబడి ఉండాలని, ఒకవేళ RSSపై వ్యక్తిగత అభిమానం బహిరంగంగా చూపించాలనుకుంటే రాజీనామా చేసి ఆ సంస్థలో చేరాలని వ్యాఖ్యానించారు. “ద్వంద్వ విధేయత చూపడం సరైంది కాదు” అని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలనే అంశంపై మరోసారి చర్చను రేకెత్తించింది.