డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు వ్యక్తిగత సమస్య మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని, కుటుంబాలను నాశనం చేసి సమాజ పునాదులను బలహీనపరిచే తీవ్రమైన సామాజిక సమస్య అని పేర్కొన్నారు.
యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా క్రమశిక్షణ, గౌరవం, సార్థకమైన జీవితం వైపు నడిపించాలని సూచించారు. ఇందుకోసం విద్య, క్రీడలు, సాంస్కృతిక విలువలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
యువశక్తిని సరైన దిశలో నడిపించడం కుటుంబాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం, సమాజం సహా ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి కీలకమని ఆయన పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news