విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్నగర్లో గల ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రజా దర్బార్ (PGRS) కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ ప్రజా దర్బార్లో నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, వైద్య, పెన్షన్, ఉపాధి, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని ఎమ్మెల్యే బొండా ఉమా గారు శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా ప్రతినిధుల అసలైన బాధ్యత అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, వేగవంతమైన సేవలందింపునకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ప్రజా దర్బార్ ద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు పదేపదే వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సమస్యలను సమర్పించుకునే అవకాశం లభిస్తోందని ఆయన తెలిపారు. అందిన ప్రతి అర్జీపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తూ, పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేస్తున్నామని వివరించారు.
పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పెన్షన్లు, ముఖ్యమంత్రి సహాయనిధి, గృహ నిర్మాణం, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని, ప్రతి సమస్యను వ్యక్తిగతంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని బొండా ఉమా గారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news