అమెరికా చరిత్రలో కీలక మైలురాయిగా భావిస్తున్న 250వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫెయిర్ వాషింగ్టన్లో ఘనంగా ప్రారంభమైంది. 16 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవంలో దేశంలోని మొత్తం 50 రాష్ట్రాలు తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆహార సంస్కృతిని ప్రదర్శిస్తున్నాయి. అమెరికా వైవిధ్యాన్ని ఒకే వేదికపై చూపించే అరుదైన కార్యక్రమంగా దీనిని నిర్వాహకులు అభివర్ణిస్తున్నారు.
ఈ ఉత్సవంలో ప్రతి రాష్ట్రం తన ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబించే ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు, స్థానిక వంటకాలు, చారిత్రక విశేషాలను సందర్శకులకు పరిచయం చేస్తోంది. వేలాది మంది ప్రజలు ఈ వేడుకలను సందర్శిస్తూ అమెరికా వారసత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. దేశభక్తి, జాతీయ ఐక్యత, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news