వెనిజులాను కుదిపేసిన వరుస భూకంపాల అనంతరం అక్కడి ప్రజలకు సాంకేతిక సహాయం అందించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ముందుకొచ్చింది. భూకంపాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్, టెలికమ్యూనికేషన్ సేవలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కొనసాగేందుకు ఉచిత సేవలను అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా స్టార్‌లింక్ టెర్మినళ్లను వేగంగా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ ఉచిత సేవలు ఒక నెలపాటు అందుబాటులో ఉండనున్నాయని సంస్థ తెలిపింది. భూకంపాల తర్వాత కుటుంబ సభ్యులతో, సహాయక బృందాలతో ప్రజలు అనుసంధానంగా ఉండేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. అత్యవసర సమాచార మార్పిడి, సహాయక చర్యల సమన్వయం, బాధిత ప్రాంతాల పరిస్థితులపై సమాచారం చేరవేయడంలో ఈ సేవలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేస్తూ స్టార్‌లింక్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news