దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ రీటెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 551 పరీక్షా కేంద్రాల్లో వేలాది మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్ష నిర్వహణ పూర్తయిందని అధికారులు తెలిపారు.
పరీక్ష అనంతరం విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఫిజిక్స్ ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకునే విధంగా ఉండటంతో పాటు గత సంవత్సరాలతో పోలిస్తే కాస్త కఠినంగా ఉన్నాయని అభ్యర్థులు పేర్కొన్నారు. ముఖ్యంగా లెక్కలు, కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని చెప్పారు.
బయాలజీ విభాగం మాత్రం సులభంగా ఉండటంతో మంచి మార్కులు సాధించే అవకాశం ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. కెమిస్ట్రీ పేపర్ మోస్తరు నుంచి కాస్త కఠిన స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. మొత్తం మీద పరీక్ష సవాలుగా ఉన్నప్పటికీ సమతుల్యంగా రూపొందించారని కొందరు అభ్యర్థులు వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3.65 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరైనట్లు సమాచారం. దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించగా, వారికి సాయంత్రం 6.20 గంటల వరకు పరీక్ష రాసే అవకాశం ఇచ్చారు. ఫలితాలపై ఇప్పుడు విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news