బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా నిలిచారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ‘ధురంధర్’ సినిమా రెండు భాగాల కోసం ఆయన రూ.325 కోట్ల పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణ రెమ్యునరేషన్‌తో పాటు ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ద్వారా సినిమా లాభాల్లోనూ వాటా పొందినట్లు సమాచారం.
సినీ వర్గాల కథనాల ప్రకారం, ‘ధురంధర్’ తొలి రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి రూ.3,200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ఈ విజయంతో రణ్‌వీర్‌కు భారీ ఆర్థిక లాభాలు వచ్చినట్లు చెబుతున్నారు.
ఇంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.250 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని, అలాగే షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, ప్రభాస్‌లు రూ.200 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే రణ్వీర్ సింగ్‌కు సంబంధించిన రూ.325 కోట్ల పారితోషికంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ఈ వార్తలు నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రణ్వీర్ సింగ్ కొత్త రికార్డు సృష్టించినట్టే. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news