కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో చేసిన ఆరోగ్య సంబంధిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను ఒకప్పుడు డయాబెటిస్తో బాధపడినప్పటికీ, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆ సమస్యను అధిగమించానని ఆయన వెల్లడించారు.
తగినంత నిద్ర, సరైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం తన ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయని షా చెప్పారు. నిద్ర నాణ్యతను పెంచుకోవడం, తగినంత నీరు తాగడం, క్రమబద్ధమైన డైట్ పాటించడం వల్ల ప్రస్తుతం మందులు, ఇన్సులిన్ అవసరం లేకుండా జీవిస్తున్నానని పేర్కొన్నారు.
యువత తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించిన ఆయన, రోజుకు కనీసం రెండు గంటలు శారీరక వ్యాయామానికి కేటాయించాలని అన్నారు. అలాగే మెదడు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం ఆరు గంటల నాణ్యమైన నిద్ర అవసరమని సూచించారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి అనేక దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుందని, యువత చిన్న వయసు నుంచే మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news