తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది అస్వస్థతకు గురికావడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలని సంబంధిత మంత్రులను సీఎం విజయ్ ఆదేశించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేసి బాధితులకు అత్యవసర వైద్యసేవలు అందించాలని అధికారులకు సూచించారు.
ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా తెలుసుకునేందుకు సీఎం విజయ్ త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, భద్రతా ప్రమాణాల అమలు, బాధ్యతలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.
మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని త్రిసభ్య కమిటీకి సీఎం విజయ్ స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతామని ప్రభుత్వం వెల్లడించింది. ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుండగా, బాధితుల చికిత్సను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news