నిడమనూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ టర్నింగ్ తిరుగుతున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలు ట్రక్ పక్క నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి ట్రక్ కింద పడిపోయారు. ఈ క్రమంలో ట్రక్ వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కాగా, భర్తకు కూడా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, భారీ వాహనాలు మలుపులు తిరిగే సమయంలో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, అతి దగ్గరగా వెళ్లడం ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Fetching videos...
Fetching latest news...
No trending news